సోమశిల వెనుక జలాలు పోటెత్తడంతో... కడప జిల్లాలోని గోపవరం, అట్లూరి మండలాల పరిధిలోని పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. సోమశిల జలాశయంలో 78శాతం నీటిమట్టం నమోదైంది. అందుకే ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు. 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, ఎత్తైన ప్రదేశాల్లో తలదాచుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ అధికారి తమను పరిస్థితి తెలుసుకోవడానికి రాలేదని వాపోయారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. స్థానిక ఎస్సై లలిత ప్రజలకు మంచినీరు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: సోమశిల ముంపుప్రాంతాల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటన