వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ.. కడప నగరంలోని ఓబుల్‌రెడ్డి పిల్లల ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఆస్పత్రిలోని సామగ్రిని ధ్వసం చేశారు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నాగయ్య పల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి, సుబ్బారెడ్డి కూతూరు పల్లవి (5) ఉదయం అస్వస్థతకు గురైంది. దీంతో పాపను కడప నగరంలోని ఓబుల్ రెడ్డి చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు.
మధ్యాహ్నం వరకు పాప బాగానే ఉన్న పాప.. కాసేపటికే మృతి చెందింది. దీంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై దాడికి దిగి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని.. పాప బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి