వ్యాపార లావాదేవీల్లో కలహాల కారణంగా.. జానపాటి గోపాల్ అనే వ్యక్తిపై కత్తులు, కర్రలు, రాళ్లతో ఐదుగురు దుండగులు దాడి చేేేేేేశారు. జనసంచారం ఎక్కువగా ఉండటంతో భయపడి.. స్వల్పంగా గాయపరిచి వెళ్లిపోయారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈ ఘటన జరిగింది.
పట్టణంలోని వివేకానంద క్లాత్ మార్కెట్‌లో బట్టల దుకాణం నడుపుతున్న జానపాటి గోపాల్‌కు, సినీ హబ్ అధినేత బసిరెడ్డి రాజేశ్వరరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు వచ్చాయి. తనకు రావాల్సిన రూ. 3.5 కోట్ల బాకీ విషయమై గోపాల్ కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు రాజేశ్వరరెడ్డికి చెందిన ఆస్తుల అటాచ్‌మెంట్‌పై దండోరా వేయించాడు. దీంతో తన పరువుకు భంగం కలిగించాడని భావించిన రాజేశ్వరరెడ్డి.. తనపై హత్యాయత్నం చేయించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. వాకింగ్ చేస్తుండగా దాడి చేశారని చెబుతున్నాడు. గోపాల్‌ను చికిత్స కోసం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
వ్యాపారిపై కర్రలు, కత్తులతో దుండగుల దాడి
ఇదీ చదవండి: