కడప జిల్లా జమ్మలమడుగులోని రామ్రెడ్డిపల్లి మోటులో తెల్లవారుజామున చెక్క డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను ఆర్పినట్లు ఇన్చార్జి అధికారి చిన్నయ్య తెలిపారు. ఈ ప్రమాదంలో దివాన్ సెట్, డబుల్ కాట్ మంచాలు, డోర్లు తదితర సామాగ్రి దగ్ధమైనట్లు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారి పేర్కొన్నారు.
ఇదీ చదవండి హత్య చేసి... గ్రామ శివార్లలో పడేసి