ETV Bharat / state

ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం...8లక్షలు ఆస్తి నష్టం

కడప పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్లాస్టిక్ వస్తువులు, యంత్రాలు కాలి బూడిదయ్యాయి. సుమారు 8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.

ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం
ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Aug 31, 2021, 12:05 AM IST

ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం

కడప శివారులోని ఓ ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్లాస్టిక్ వస్తువులు, యంత్రాలు కాలిబూడిదయ్యాయి. సుమారు ఎనిమిది లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పరిశ్రమలో వస్తువులు మొత్తం కాలి బూడిద అయింది. కడపకు చెందిన నలుగురు వ్యక్తులు పరిశ్రమలవాడలో గత కొన్నేళ్ల నుంచి మా సాయి పేరిట ప్లాస్టిక్ బిందెల కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు.

సాయంత్రం కార్మికులు పని ముగించుకుని ఇంటికి వెళ్లారు. సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో కర్మాగారంలో నుంచి పొగలు రావడంతో స్థానికులు గుర్తించారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం చేరవేశారు. అక్కడ మొత్తం ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు క్షణాల్లో అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వెళ్లి మంటలను అదుపు చేశారు.

ఇదీ చదవండి:

'ఆ రాష్ట్ర సీఎంను ఆదర్శంగా తీసుకొని జగన్ పాలన కొనసాగించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.