కడప శివారులోని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కర్మాగారంలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. యూపీసీ విభాగంలో ఉన్న పరికరాలన్నీ కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో దాదాపు లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లింది. సమయానికి ఆ విభాగంలో కార్మికులు లేని కారణంగా.. ప్రాణాపాయం తప్పింది.
ఇదీ చదవండి: