కడప జిల్లా పులివెందులలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. పలు రికార్డులు దగ్ధమయ్యాయి. బంగారు నగలు తూకం వేసే సామగ్రి కాలిపోయింది. బ్యాంకు వెనుకభాగంలో ఉన్న చెట్లకు నిప్పు పెట్టడంతో ఆ మంటలు బ్యాంకులోకి వ్యాపించాయి. ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులో సిబ్బంది ఎవరు లేని సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సెలవుదినాల్లో మంటలు వ్యాపించటంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి