కరోనాతో మరణించిన దంపతుల పిల్లలకు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా.. కడప కలెక్టరేట్ లో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, కలెక్టర్ హరి కిరణ్ చెక్కులు అందించారు. ఇప్పటివరకు 3 కుటుంబాలకు సంబంధించిన పిల్లలను గుర్తించి వారికి సహాయాన్ని అందజేశారు.
పిల్లలకు 25 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులో ఈ డబ్బు భద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. నెలకు వడ్డీ కావాలన్నా తీసుకోవచ్చని, లేదంటే ఒకేసారి కలిపి తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. వైయస్సార్ బీమా కాకుండా అదనంగా రూ.10 లక్షలు అందజేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: