ETV Bharat / state

గ్రామ వాలంటీర్ల సేవలు అనిర్వచనీయం: కలెక్టర్ హరికిరణ్ - రైల్వే కోడూరులో వాలంటీర్లకు సన్మానం

కరోనా విపత్కర పరిస్థితుల్లో రైల్వే కోడూర్ నియోజకవర్గంలోని గ్రామ వాలంటీర్ల సేవలు అనిర్వచనీయమని కడప కలెక్టర్ హరి కిరణ్ అన్నారు. వాలంటీర్ల సేవలకుగానూ రైల్వే కోడూరులో వాలంటీర్ల సేవాలకు సత్కార కార్యక్రమం నిర్విహించారు.

felicitation to valentrees at kadapa
వాలంటీర్లకు సత్కార కార్యక్రమం
author img

By

Published : Apr 14, 2021, 4:21 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరులోని హెచ్​ఎంఎం హైస్కూలు​లో వాలంటీర్ల సేవా సత్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సేవలకుగానూ.. సేవా రత్న, సేవా మిత్ర, సేవ వజ్ర బహుమతులు ప్రదానం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో గ్రామ వాలంటీర్ల సేవలు అనిర్వచనీయమని కడప కలెక్టర్ హరికిరణ్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్​.. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమం చేపట్టారని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాలంటీర్లు వారధిగా పనిచేస్తున్నారని.. దాన్ని ఓర్వలేకే వాలంటరీ వ్యవస్థపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ అన్బురాజన్, రాజంపేట సబ్​ కలెక్టర్, వాలంటీర్లతోపాటు స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

బాబాయ్​ని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్​కు లేదా..?

సీబీఎస్​‌ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.