సామాజిక మాధ్యమాల్లో అనవసరమైన పోస్టులు పెట్టే బదులు... రైతన్నల కష్టాల గురించి పెడితే బాగుంటుందని కడప జిల్లాకు చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి అరటి తోట వేస్తే నష్టాలు మిగిలాయని వాపోయాడు. ఇప్పటికైనా రైతులు పడే అవస్థలను అర్థం చేసుకుని ఇతర విషయాలు పోస్ట్ చేసే బదులు... అన్నదాతల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అందరినీ కోరాడు. ఈ విషయం మంత్రి కన్నబాబు వరకూ వెళ్లింది. సమస్యను తాను స్వయంగా పరిశీలిస్తానని.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: