దేశానికి స్వాతంత్రం వచ్చి 73 ఏళ్లు అయినప్పటికీ ప్రజలకు తిండి, బట్ట, వసతి, విద్య, వైద్యం కరవైందని రైతు రాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు గుర్రప్ప అన్నారు. వంగవీటి మోహన్ రంగా జయంతి రోజు కడప జిల్లాలో పార్టీ ప్రారంభించటం సంతోషంగా ఉందని తెలిపారు. ఏ పార్టీలు వచ్చినప్పటికీ బంధుప్రీతి, కులం, అవినీతి అనే మూడింటిపైనే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
వంగవీటి మోహన్ రంగ స్ఫూర్తిగా పార్టీ ఏర్పాటు చేశామని తెలిపారు గుర్రప్ప. రైతులందరికీ నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని, ప్రతి గ్రామానికి నీరు, విద్యుత్, గ్రంథాలయం, వైద్యశాల, ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తదితర సిద్ధాంతాలతో పార్టీని ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇదీ చూడండి