కడప జిల్లా బి. కోడూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన.. అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికి వచ్చిన వందలాది ఎకరాల్లోని పంట.. నేల పాలైంది. ఉరుములు, మెరుపులతో.. ఈదురు గాలులతో హోరుగా కురిసిన వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట నష్టాన్ని అంచనా వేసి... తమకు సాయం చేయాలని అన్నదాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: