ETV Bharat / state

నకిలీ బొప్పాయి విత్తనాలతో దిగుబడి తగ్గిపోతోందని రైతుల ఆవేదన

author img

By

Published : Jun 29, 2021, 10:20 PM IST

పంట సాగు మొదలైనప్పటి నుంచి దిగుబడి చేతికందే వరకు రైతు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విత్తనమే నకిలీది అయితే ఇక పంట మీద ఆశ వదులుకోవాల్సిందే. కడప జిల్లా రైల్వేకోడూరు పరిధిలో బొప్పాయి రైతులు.. నకిలీ విత్తనాలు, మొక్కలతో నష్టపోతున్నారు. ఒకే రకమైన వంగడం ఎక్కువ సంవత్సరాలు సాగు చేయటం వల్ల దిగుబడి తగ్గిపోతుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.

Fake papaya seeds
Fake papaya seeds
నకిలీ బొప్పాయి విత్తనాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో నకిలీ బొప్పాయి విత్తనాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు వేల ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు. నర్సరీ యజమానులు నకిలీ విత్తనాలు, నాసిరకం మొక్కలు విక్రయించడంతో పుష్పాలు రాలి దిగుబడి తగ్గిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే రకమైన వంగడం సాగు చేయడం వల్లే దిగుబడి తగ్గుతుందని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. పంట మార్పిడితో పంటలకు సోకే వైరస్‌లు, తెగుళ్లు నివారించవచ్చునని అంటున్నారు.

బొప్పాయి సాగులో అగ్రభాగం రెడ్ లేడీ రకం వంగడాన్ని రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. ఒకప్పుడు రెడ్​ లేడీ రకం చాలా ప్రసిద్ధి చెందినదని.. ఇప్పుడు నాసిరకం విత్తనాల వల్ల కాయ పెరగటం లేదని రైతులు చెబుతున్నారు. రంగు, రుచిలోనూ తేడాలు కనిపించాయని చెప్పారు. పూత రాలిపోవటంతో దిగుబడి తక్కువగా ఉంటోందన్నారు. ఎకరాకు లక్షా ఇరవై వేలు పెట్టుబడి కోసం ఖర్చు అవుతోందని, నర్సరీలో జరిగే మోసాల వల్ల నష్టపోతున్నామని రైతులు వాపోయారు. అప్పు చేసి సాగు చేసిన వారి పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.

ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండడంతో బొప్పాయి నారు ఆలస్యంగా నాటడం వలన మొక్కలు పుష్పించే దశలో ఎండ వేడిమి ఎక్కువ ఉండటం పూత రాలిపోయినట్లు గుర్తించామని ఉద్యాన శాఖ అధికారి రేణుక ప్రసాద్ అన్నారు. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా బొప్పాయి పంటలకు కావలసిన పోషకాలు, ఎరువులు సరైన మోతాదులో అందించకపోవటం కూడా ఒక కారణమన్నారు. ఒకే పంటను ఎక్కువ కాలం సాగు చేయటం వల్ల దిగుబడులు తగ్గుతాయన్నారు. పంట మార్పిడి చేయాలని...దీనివల్ల పంటలకు సోకే వైరస్​లు,తెగుళ్లు తగ్గుతాయన్నారు.

ఇదీ చదవండి: ప్రాణదాతల సంరక్షణకు నడుం బిగించిన ప్రకృతి ప్రేమికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.