కడప జిల్లా రాయచోటి కొత్తపల్లిలో యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుటుంబసభ్యులను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఆమె తండ్రి పటాన్ మహమ్మద్ ఆరిఫ్, తల్లి పటాన్ మున్వార్ జహాన్, సోదరుడు తాజోద్దిన్లను రిమాండ్‌కు తరలించారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందనే ఆగ్రహంతో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని డీఎస్పీ వాసుదేవన్ చెప్పారు. గాయపడిన యువతిని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం యువతిని కడప రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి కర్నూలు మెడికల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వద్దని వారిస్తున్నా తాజోద్దిన్ తొందరపడ్డాడని యువతి తండ్రి కంటతడి పెట్టాడు. యువతికి మైరుగైన వైద్యం అందించాలని పలు సంఘాలు కోరాయి.
ఇదీ చదవండి: కుటుంబసభ్యుల ఘాతుకం: యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సోదరుడు