ETV Bharat / state

వైఎస్ వివేకా హత్యకేసులో.. ఐదో రోజు సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య కేసులో ఐదవ రోజు సీబీఐ విచార‌ణ కొన‌సాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ రవాణా శాఖ అధికారులను విచారిస్తోంది. వివేకా హత్య సమయంలో అనుమానాస్పద వాహనాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

viveka murder case
viveka murder case
author img

By

Published : Jun 11, 2021, 11:43 AM IST

Updated : Jun 11, 2021, 2:13 PM IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఐదోరోజు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ విచారణ జరుపుతోంది. వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని వరసగా ఐదోరోజు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతనితోపాటు వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్​ కూడా వరసగా మూడు రోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరగడానికి 15 రోజుల ముందు కిరణ్ కుమార్ యాదవ్ వివేకాను కలిసినట్లు సీబీఐ ప్రాథమిక సమాచారం సేకరించింది.

మధ్యాహ్నం కడప నుంచి రెండు సీబీఐ బృందాలు పులివెందులకు వెళ్లాయి. వివేకా ఇంటిని ఓ బృందం మరోసారి పరిశీలిస్తోంది. నిన్న రాత్రి దాదాపు 3 గంటలపాటు పరిశీలించిన సీబీఐ అధికారులు.. ఇవాళ మరోసారి పరిశీలిస్తున్నారు. మరో సీబీఐ బృందం పులివెందులలోని సునీల్ కుమార్ యాదవ్ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. సునీల్ కుమార్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్ ఇద్దరూ అన్నదమ్ములు. సునీల్ కుమార్ యాదవ్ వివేకాకు అత్యంత సన్నిహితుడు కావడంతో.. సీబీఐకి ఉన్న అనుమానాలతో సోదరులిద్దరినీ విచారిస్తోంది. దీంతోపాటు రవాణశాఖ అధికారులు కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు అనుమానాస్పద వాహనాల వివారలు సేకరిస్తున్నారు.

ఇప్పటి వరకూ విచారణ ఇలా..

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. గత ఐదు రోజులుగా ఈకేసులో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌గా పని చేసిన ఇద‌య‌తుల్లాతో పాటు పులివెందుల‌కు చెందిన వైకాపా కార్య‌క‌ర్త‌ కిర‌ణ్ కుమార్ యాద‌వ్‌ను సీబీఐ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

ఇద‌య‌తుల్లాతో పాటు వివేకా కారు మాజీ డ్రైవ‌ర్ ద‌స్త‌గిరిని కూడా అధికారులు ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. దస్తగిరిని సోమవారం ఏడు గంట‌ల పాటు ప్రశ్నించిన విష‌యం తెలిసిందే. తొలి దఫా ఎంక్వైరీలో.. ఆయన్ను నెల రోజులుగా సీబీఐ అధికారులు దిల్లీలో విచారణ చేసి ఇటీవలే కడపకు పంపించారు. తాజాగా మళ్లీ విచారణకు పిలిచారు. వివేకా హత్యకు సుమారు 6 నెలల ముందుగా ఎందుకు పని మానేయాల్సి వచ్చింది? ఆర్థిక లావాదేవీల విషయాలేంటి.. అన్న వివరాలపై దస్తగిరిని ప్రశ్నించినట్లు సమాచారం. ఐదో రోజు విచారణలో.... వివేకా హత్య సమయంలో సంచరించిన వాహనాలపై రవాణా శాఖ అధికారులనుంచి ఆరా తీస్తున్నారు.

2019 మార్చిలో వివేకా హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో వైఎస్ వివేకా మృత‌దేహాన్ని తొలుత ఇద‌య‌తుల్లా త‌న ఫోన్‌లో ఫొటోలు తీసిన‌ట్లు అధికారుల వ‌ద్ద ప్రాథ‌మిక స‌మాచారం ఉంది. ఈ నేప‌థ్యంలో హ‌త్య జ‌రిగినప్పుడు ఇంట్లో ఎవ‌రెవ‌రు ఉన్నారు? బాత్‌రూమ్ నుంచి వివేకా మృత‌దేహాన్ని బెడ్‌రూమ్‌లోకి ఎవ‌రు త‌ర‌లించార‌నే త‌దిత‌ర విష‌యాల‌పై అధికారులు విచార‌ణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఫేస్​బుక్​, టెలిగ్రామ్​కు భారీ జరిమానా

Last Updated : Jun 11, 2021, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.