ETV Bharat / state

నర్రెడ్డి సునీతకు క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారం - ex minister ys viveka daughter Sunitha reddy

YS Viveka Daughter Sunitha: మాజీ మంత్రి వైఎస్​ వివేకా కూతురు డా. నర్రెడ్డి సునీత.. క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ యు.యు. లలిత్.. ఆమెకు అవార్డు అందజేశారు.

Dr Sunitha Reddy
Dr Sunitha Reddy
author img

By

Published : Nov 6, 2022, 5:44 PM IST

Dr Sunitha Reddy : ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ సునీత నర్రెడ్డి.. క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారం అందుకున్నారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ యు.యు. లలిత్ .. ఆమెకు అవార్డు అందజేశారు. స్వైన్ ఫ్లూ, కొవిడ్ వంటి మహమ్మారుల కట్టడికి కృషి చేసిన డాక్టర్ సునీత నర్రెడ్డి.. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నుంచి ఏంబీబీఎస్​ పట్టా పొందారు. అమెరికా డియర్ బర్న్​లోని ఓక్ వుడ్ హాస్పిటల్స్​లో ఇంటర్నల్ మెడిసిన్ లో ఎండీ పూర్తి చేశారు.

అమెరికా వేన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి సాంక్రమిక వ్యాధుల నియంత్రణలోనూ ఎండీ పట్టా పొందారు. పదేళ్లకుపైగా అమెరికాలో ఉన్న ఆమె.. 2009లో స్వదేశానికి తిరిగి వచ్చారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్​లో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగంలో సేవలు అందించారు. ఆ తర్వాత నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ద్వారా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఫెలోషిప్​ను మొదలుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో స్వైన్ ఫ్లూ హెచ్​1ఎన్​1 మహమ్మారి నియంత్రణ నిపుణురాలిగా గుర్తింపు పొందారు.

కొవిడ్ సమయంలో తెలంగాణలో ఆమె సేవలందించారు. తాజాగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో క్షయ రోగుల బాగోగుల కోసం కృషి చేస్తున్నారు. తెలంగాణ తరఫున టీబీ నిపుణుల వైద్యుల ప్యానెల్​లోనూ సభ్యురాలిగా ఉన్నారు. హైదరాబాద్​లోని అపోలో హాస్పిటల్స్​లో యాంటీ మైక్రోబయల్ స్టీవార్డ్ షిప్ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. డాక్టర్ సునీత.. క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఇండియా.. వ్యవస్థాపక సభ్యురాలే కాకుండా కోశాధికారి కూడా.

క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న వైఎస్​ వివేకా కూతురు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.