ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం వృక్షాలు రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయని అటవీ అధికారులు తెలిపారు. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మరింత గిరాకీ ఉందన్నారు. అంతర్జాతీయ స్మగ్లర్లు కడప జిల్లాలో ఉన్న అడవుల పై కన్నేశారని వివరించారు. ఎర్రచందనం వృక్షాలను దుంగల గా మార్చి ఎల్లలు దాటి స్తున్నారని.. ప్రభుత్వ చర్యలతో మూడేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా తగ్గిందని పేర్కొన్నారు. రెండు నెలలుగా అక్రమ రవాణా కార్యకలాపాలు పెరిగాయని వివరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. పూర్తిగా నియంత్రించేందుకు చట్టాలు ఎంతమేర ఉపక్రమిస్తున్నాయి... అనే అంశాలపై ప్రొద్దుటూర్ డిఎఫ్ ఓ గురు ప్రభాకర్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇది కూడా చదవండి.