కడప జిల్లా జమ్మలమడుగులో ఉపాధి హామీ క్లస్టర్ స్థాయి సమావేశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ యదు భూషణ్రెడ్డి అధ్యక్షతన జరిగింది. నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హజరయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉన్నా ఉపయోగించుకోలేక పోతున్నామని ఎమ్మెల్యే వాపోయారు. తన నియోజకవర్గంలో ఇంతవరకు ఒక్క సచివాలయం కూడా ప్రారంభానికి నోచుకోక పోవడం అవమానకరమని బాధపడ్డారు. అధికారులు నిర్లక్ష్యం వీడి అభివృద్ధివైపు ఆలోచించాలని సూచించారు.
ఇవీ చదవండి