కడప జిల్లా మైదుకూరులో.. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతుల మీదుగా 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు బియ్యంతోపాటు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. పురపాలిక కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అంబేడ్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే, మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, ఎనిమిది రకాల సరకులను అందించారు. కార్యక్రమంలో పురపాలిక కమిషనర్ పీవీరామకృష్ణ, ఏఈ మధుసూదన్‌బాబు, సీఐ మధుసూదన్‌గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: