Electricity Transformer at House Premises: విద్యుత్ స్తంభానికి ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ఆ ఇంట్లో వాళ్లు భయందోళనకు గురవుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు దాని నుంచి నిప్పులు చెలరేగుతున్నాయి. విద్యుత్‌షాక్‌తో ఏం జరుగుతుందోనని వాళ్లు టెన్షన్ పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. పాలకులకు చెప్పినా పరిష్కారం లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని.. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
కడప జిల్లాలోని అట్లూరు గాండ్లపల్లి కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో విద్యుత్‌శాఖ అధికారులు విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చేతికి అందే ఎత్తులో ఉండటంతో.. ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వాళ్లు భయపడుతున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని,.. దీనివల్ల వారికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా అని వాపోతున్నారు. ఇంటి ఆవరణలోకి రావాలంటేనే భయంగా ఉందని.. దానినుంచి అప్పుడప్పుడు నిప్పురవ్వలు చెలరేగుతున్నాయని అంటున్నారు. వర్షాలు పడినప్పుడు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ విద్యుత్ ప్రసారం అవుతుందని అంటున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ఆ ఇంట్లో జీవనం సాగిస్తున్నామంటున్నారు.
దీనిపై పలుమార్లు విద్యుత్‌శాఖ అధికారులకు విన్నవించినా.. వారు పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సుధా గడప గడప కార్యక్రమంలో ఆ ఇంటికి వచ్చినప్పుడు.. ఆమెకు తమ సమస్య వివరించామని ఆ ఇంటివాళ్లు చెబుతున్నారు. విద్యుత్ స్తంభాన్ని అక్కడినుంచి తొలగించాలని ఆమె విద్యుత్‌శాఖ అధికారులకు ఆదేశించినా ఫలితం లేదని వారు వాపోతున్నారు. విద్యుత్ స్తంభం తొలగించేందుకు అధికారులు రూ.20 వేల నుంచి 50 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: