నేడు, రేపు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షానికి వెలిగల్లు ప్రాజెక్టుకు వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి 2 వేల క్యూసెక్కులు పాపాగ్ని నదికి అధికారులు విడుదల చేశారు. నదీ పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. 400 క్యూసెక్కుల నీటిని బాహుదా నదిలోకి విడుదల చేశారు.
కడప జిల్లాలో గులాబ్ తుపాను ప్రభావం చూపుతోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాయచోటిలో 9.64 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి : Accidental death : వేంపల్లెలో వ్యక్తి మీద అద్దాలు పడి మృతి