అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తెలుపుతూ జనవరి 23న శివకుమార్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా తన పేరిటే ఉందని తనను సస్పెన్షన్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడు జగన్‌కు లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణచేసి తగు చర్యలు తీసుకోవాలంటూ ఈసీని కోరారు. స్పందించిన ఎన్నికల కమిషన్ఈ విషయంపై వివరణ ఇవ్వాలని వైకాపా అధ్యక్షుడు జగన్కునోటీసు జారీ చేసింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను, కేసీఆర్ గతంలో తిట్టారని.. ఆయనకు వైకాపా శ్రేణులు ఓట్లు వేయవద్దని.. కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో శివకుమార్ పేరిట డిసెంబర్ 4న లేఖ విడుదలైంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన ఆశయాల సాధనకోసం అభిమానుల నుంచి వైకాపా పుట్టింది కాబట్టి ఆయన అభిమానులంతా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని లేఖలో కోరారు. దీనిపై వైకాపా అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది . పార్టీ లెటర్ హెడ్ ఉపయోగించి శివకుమార్ ఇచ్చిన ప్రకటనను, క్రమశిక్షణ రాహిత్యంగా భావిస్తున్నట్లు తెలుపుతూ ఆయనను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని శివకుమార్ ఈసీని ఆశ్రయించారు.