Dwakra Group RP Dismissed on Corruption Allegations: కడప జిల్లాలో సచివాలయ అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. వైసీపీ నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనలేదనే కారణంతో అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని డ్వాక్రా సంఘాల మహిళలు ఆరోపిస్తున్నారు. వాలంటీర్లు, సచివాలయ అధికారులు కలిసి వైసీపీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని.. డ్వాక్రా సంఘాల మహిళలు అంటున్నారు. అంతేకాకుండా వారి ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని.. డ్వాక్రా సంఘాలకు ఏటువంటి ప్రభుత్వ సహాయలు అందకుండా చేస్తామని బెదిరిస్తున్నారంటూ వాపోయారు.
అసలేంజరిగిదంటే.. కడప పట్టణంలో ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో డ్యాక్రా సంఘాలకు సంబంధించిన ఆర్పీ రాజేశ్వరి హాజరు కాలేదు. దీంతో ఆమెను విధుల నుంచి తొలగిస్తామంటూ సచివాలయ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని.. డ్వాక్రా సంఘాల మహిళలు ఆరోపిస్తున్నారు. తమకు ఆర్పీగా రాజేశ్వరినే కావాలంటూ మహిళలు పట్టుబట్టారు.
ఆర్పీ రాజేశ్వరి ఇటీవల టీడీపీలో చేరారు. దీంతో గడప గడపకు హాజరు కాలేదని.. టీడీపీలో చేరిందని రాజేశ్వరిని విధుల నుంచి తొలగించాలని అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె అవినీతి పాల్పడిందని.. విధులు సరిగా నిర్వహించడం లేదంటూ అధికారులు వేధింపులకు గురి చేశారని డ్వాక్రా మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే విచారణ జరుపుతున్నామని కడప ఆశోక్నగర్లోని సచివాలయం వద్దకు రావాలని రాజేశ్వరికి అధికారులు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న డ్వాక్రా సంఘాల మహిళలు.. పెద్ద ఎత్తున రాజేశ్వరితో పాటు సచివాలయం వద్దకు చేరుకున్నారు. విధుల నుంచి ఎందుకు తొలగిస్తారంటూ అధికారులను నిలదీశారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు. అంతేకాకుండా వాలంటీర్లు కూడా.. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనాలని తమపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని మహిళలు ఆరోపించారు. వైసీపీ కార్య్రక్రమాల్లో పాల్గొనకపోతే.. డ్వాక్రా సంఘాల ఖాతాలు నిలిపివేస్తామని.. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని అందకుండా చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఆర్పీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని.. విధులు సక్రమంగానే నిర్వహిస్తున్నారని మహిళలు అన్నారు.
జంగారెడ్డిగూడెంలో ఆర్పీల నిరసన
ఈ విషయం తెలుసుకున్న కడప జిల్లా టీడీపీ నేత మాధవి రెడ్డి.. సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఆర్పీని ఎందుకు తొలగిస్తారని అధికారులను నిలదీశారు. అంతేకాకుండా.. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనాలని డ్వాక్రా సంఘాల మహిళలను ఎందుకు వేధింపులకు గురిచేస్తారని ప్రశ్నించారు. అనవసర కారణాలతో ఆర్పీలను తొలగిస్తే.. ఉరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. జగన్ ప్రభుత్వం మహిళ సంఘాలను వైసీపీ కార్యక్రమాలకు హాజరు కావాలని వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సొంత వ్యవస్థగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.
'దాడులు పెరుగుతున్నా.. రక్షణ కల్పించరా?'