కరోనా వైరస్ వల్ల గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇండియన్ ఎంబసీ వారు పాస్‌పోర్టు, వీసాలు లేకుండా పనులు చేసుకుంటూ ఉన్నవారికి.... భారత్ పంపిస్తామంటూ ప్రకటన జారీ చేయటంతో... వందల సంఖ్యలో ప్రవాసాంధ్రులు దరఖాస్తు చేసుకున్నారు. భౌతిక దూరం అంటూ కొందరిని అక్కడి నుంచి బయటికి పంపించారు. ఈ నేపథ్యంలో వారు రోడ్లమీదే పడిగాపులు కాస్తున్నారు. తినడానికి తిండి, తాగేందుకు నీరు లేక... బాత్రూం సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులో ఉన్న వారి బంధువులకు కువైట్ నుంచి ఫోటోలు, వీడియోలు పంపి సమాచారం ఇవ్వటంతో... వారు ఈటీవీ భారత్‌ను సంప్రదించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కువైట్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి.... భారత్‌కు రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: