కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో ఇంటింటికి వెళ్లి యాచించే యాచకులు, రోజువారీ కూలీలు పనుల్లేక ఆకలితో అలమటిస్తున్నారు. వీరి బాధను అర్ధం చేసుకున్న యువత, స్వచ్ఛంద సంస్థలు వారి ఆకలి తీర్చేందుకు ఆహారంతో పాటు మజ్జిగ, శీతల పానీయాలను అందిస్తున్నారు. వీరితోపాటు సేవలందిస్తున్న పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఆహారాన్ని అందజేస్తున్నారు. ఈ వితరణకు దాతల సహకారం మరువలేనిదని వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: జిల్లాలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు : కలెక్టర్