కరోనా వైరస్ బాధితులకు సేవలందిస్తున్న డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. మాస్కులు, శరీరాన్ని కప్పేసే దుస్తులు ధరించాలని సూచించారు. కడప జిల్లా రాజంపేట పురపాలక భవనంలో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల అధికారులతో కరోనాపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రసాయన ద్రావణాన్ని పిచికారి చేయాలని అధికారులకు ఆదేశించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు.
ఇదీచదవండి