కడప జిల్లా జమ్మలమడుగు పొన్నతోట వద్ద గల పురాతన ఆలయం వెనుక గుప్త నిధుల కోసం తవ్వినట్లు వచ్చిన వదంతులు తప్పని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఆ వదంతులు నమ్మవద్దని ఆయన సూచించారు.
వర్షాల వల్లే ఆ గుంత..
వర్షాల వల్ల గుంత పడటాన్ని చూసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ప్రచారం జరిగిందన్నారు. పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం వెనకాల పెద్ద గొయ్యి ఏర్పడిందని మంగళవారం జమ్మలమడుగు పట్టణ ఠాణాలో నాగరాజు తెలిపారు. ఇటీవలే కురిసిన అధిక వర్షాలే గుంతకు కారణం తప్ప ఎలాంటి తవ్వకాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.