ఇదీచదవండి.
'మహిళలతో అసభ్యకరంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు' - disha app
బాలికలు, మహిళలతో అసభ్యకరంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు హెచ్చరించారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం 'దిశ' చట్టాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రతీ మహిళ ఈ చట్టానికి సంబంధించిన యాప్ను చరవాణిలో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జమ్మలమడుగు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో 'దిశ చట్టం- మహిళా రక్షణ'పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న వేధింపులను నాటక రూపంలో ప్రదర్శించారు.
జమ్మలమడుగులో దిశ చట్టంపై అవగాహన ప్రదర్శన