Sri Bhagavan Mahavir Museum: శ్రీ భగవాన్ మహావీర్ ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి స్థానిక జైనులు విరాళాలిచ్చారు. 1982లో ఈ పురావస్తు ప్రదర్శనశాలను అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఇందులోని నాలుగు గ్యాలరీల్లో చరిత్రకారుల విగ్రహాలు, శాసనాలు, రాజుల కాలం నాటి ఖడ్గాలు, నాణేలు, పంచలోహ విగ్రహాలు, ఆదిమానవులు ఉపయోగించిన రాళ్లు, కర్రలు ఇక్కడ దర్శనమిస్తాయి. మొత్తం 333 విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి.
కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమైన పురాతన వస్తువులను ఈ పురావస్తు ప్రదర్శనశాలలో సందర్శకుల కోసం భద్రపరిచారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణా లోపంతో శిథిలావస్థకు చేరిన ఈ భవనంలో.. విద్యుత్ సౌకర్యం లేకుండానే విధులు నిర్వహిస్తున్నామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మ్యూజియంలో సిబ్బంది కొరత కూడా ఉందన్నారు.
మ్యూజియంను సందర్శించడానికి వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని పురావస్తు ప్రదర్శనశాల సిబ్బంది తెలిపారు. నూతన భవన నిర్మాణ కోసం ప్రభుత్వానికి నాలుగేళ్ల నుంచి ప్రతిపాదనలు పంపుతున్నా.. స్పందన కరవైందంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన భవనం నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రధాన రహదారి పక్కనే మహావీర్ మ్యూజియం పేరుతో ఉన్నటువంటి ఈ సంగ్రాహాలయం పురావస్తు శాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా షోచనీయం.. అసలు దీనికి దారి ఎటువైపు ఉందో తెలియక జనాలు.. దీనిరి దారి లేదేమోనని అనుకునే పరిస్థితి వచ్చింది. శిధిలమైపోతున్న ఈ భవనాన్ని పునరుద్ధించవలసిన అవసరముంది.. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు చెంది ఉండి కూడా.. ఈ మ్యూజియం షోచనీయంగా ఉండటం చాలా బాధాకరం.. దీనిని పునరుద్ధించవలసిన అవసరమెంతైన ఉంది.. జానమద్ది సాహితీపీఠం మేనేజింగ్ ట్రస్టీ
ఆ కాలంలో చాలా వైభవంగా మా జైనమతస్థుల వాళ్లు.. పెద్దలు ప్రభుత్వంతో కలిసి చాలా వైభవంగా ఈ మ్యూజియాన్ని కట్టించారు.. ఆ మ్యూజియం దాదాపు 20సంవత్సరాలుగా బాగానే నడిచింది..గైడ్ ఉన్నారు.. స్కూల్ పిల్లలు వచ్చేవారు.. కడపకు ఈ మ్యూజియం ఒక కలగా ఉండేది.. ఇప్పుడు చూస్తే బాగా పాతపడి మూతపడేటట్లు ఉంది... ప్రభుత్వం శ్రద్ధ చూపి ముందు ఏవిధంగా ఉండేదో ..అలా ఉంచాలని మనవి చేస్తున్నాను.. దిలీప్ అశోక్ జైన్ జైన్ జేనమత సమాజ సేవకుడు
ఇవీ చదవండి: