విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కడప విద్యుత్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టాలని సిఐటియు డిమాండ్ చేసింది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని గుర్తుచేశారు.
జగన్ సీఎం అయ్యి నెలలు గడుస్తున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రమాద బీమా పాలసీని 50 లక్షల వర్తింప చేయాలని కోరారు. వేంపల్లిలో ఉన్న విద్యుత్ అధికారి శ్రీకాంత్ 11 ఏళ్లుగా అక్కడే పనిచేస్తూ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయ నాయకులకు మాటలు వింటూ విద్యుత్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: