కడప జిల్లా మైదుకూరులోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఎదుట రైతుసంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ.రమణ మాట్లాడుతూ..వ్యవసాయదారులు బంగారు తాకట్టుపై తీసుకునే రుణాలపై రాయితీని కేంద్రం రద్దు చేయడం సరికాదన్నారు. వ్యవసాయ రంగంపై రాయితీల రద్దు తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. వ్యవసాయరంగానికి 18 శాతం రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకు నిబంధన పెట్టినా అమలు కాలేదని ఆరోపించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను శాస్త్రీయబద్ధంగా విశ్లేషించి పంట రుణాల్ని పెంచాలని కోరారు. నిజమైన సాగుదారులకు బంగారు తాకట్టు పెట్టి ఇచ్చే వడ్డీ రాయితీని కొనసాగించాలని డిమాండు చేశారు. లేకపోతే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందించారు.
ఇదీ చూడండి:చిత్తూరు వాసి.. సౌదీలో దుర్మరణం