ETV Bharat / state

'60 ఏళ్లు పైబడిన వారు ర్యాపిడ్​ టెస్ట్​ చేయించుకోవాలి'

కడప సాయిపేట హరిజనవాడలో ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా సందర్శించారు. ప్రతి పీహెచ్​సీ పరిధిలో 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ర్యాపిడ్ టెస్టులు చేయాలన్నారు.​ ఈ టెస్ట్​ల ద్వారా 10 నుంచి 15 నిమిషాలలో కరోనా వైరస్​ వ్యాధిని కనిపెట్టవచ్చని తెలిపారు.

deputy cm amjad basha opened rapid its in kadapa
రాపిడ్​ టెస్ట్​ చేయించుకుంటున్న ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాష్​
author img

By

Published : Apr 26, 2020, 11:05 AM IST

Updated : Apr 26, 2020, 8:49 PM IST

60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక ర్యాపిడ్​ టెస్ట్​లు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పీహెచ్​సీలకు 200 కరోనా రాపిడ్ టెస్టింగ్​​ కిట్లు ఇవ్వడం జరిగిందన్నారు. శనివారం కడపలోని సాయిపేట హరిజనవాడలో ఉపముఖ్యమంత్రి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ప్రారంభించారు. ముఖ్యంగా ప్రతి పీహెచ్​సీ పరిధిలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు కరోనా పాజిటివ్​ ఉన్నట్లయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ర్యాపిడ్​ టెస్టింగ్​ కిట్ల ద్వారా 10 నుంచి 15 నిమిషాలలో కరోనా వ్యాధిని నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. రెడ్​ జోన్​ ప్రాంతంలో ప్రస్తుతం జ్వరం, దగ్గు, ఆయాసం, జలుబు, విరేచనాలు ఉన్నవారు పది రోజుల తర్వాత ర్యాపిడ్​ టెస్ట్​లు చేయించుకుంటే కరెక్ట్​గా ఫలితాలు వస్తుందన్నారు. కరోనా కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాపిడ్​ టెస్టింగ్​ పరీక్షలు వేగవంతం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన​ పరీక్ష​ చేయించుకున్నారు.

ఇదీ చదవండి :

కరోనా పాజిటివ్ కేసులతో అప్రమత్తమైన యంత్రాంగం

Last Updated : Apr 26, 2020, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.