కరోనా వైరస్ విజృంభణ.... లాక్డౌన్ కారణంగా నిరుపేదలు పస్తులుంటున్నారు. వీరీని ఆదుకునేందుకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కడప నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్, ఆర్డీవో, అధికారులతో పాటు నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 30 నుంచి కడప నగరంలోని 5 వేల మంది పేదలకు మూడు పూటల భోజనం, మరో 25 వేల మందికి నిత్యావసర వస్తువులను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం విరాళాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. తన వంతు సాయంగా 10 లక్షల రూపాయలు ప్రకటించారు. ప్రభుత్వ పరంగా పేదలకు 29వ తేదీ నుంచి రేషన్ కార్డు దారులందరికీ ఉచితంగా రేషన్ అందిస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 4న వెయ్యి రూపాయల నగదు అందిస్తామన్నారు.
ఇదీ చదవండి: