ETV Bharat / state

రెయిన్​ అలర్ట్​ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం- 23 నాటికి అల్పపీడనం - RAIN ALERT TO SOUTH COASTAL

రైతులు వ్యవసాయపనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న అధికారులు

low_pressure_likely_over_bay_of_bengal_by_november
low_pressure_likely_over_bay_of_bengal_by_november (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2024, 8:52 AM IST

Updated : Nov 20, 2024, 8:58 AM IST

Low Pressure Likely Over Bay of Bengal by November 23 : బంగాళాఖాతంలో గురువారం నాటికి ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం 23 నాటికి అల్పపీడనంగా బలపడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదిలే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 27, 28 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ సూచించారు.

Last Updated : Nov 20, 2024, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.