కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్సిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఫీజురీయంబర్స్‌మెంటు ఉన్నా ఫీజులు కట్టమంటున్న ప్రిన్సిపల్ తీరును నిరసిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ప్రిన్సిపల్ గది ముందే నిరసనకు దిగినా ప్రిన్సిపల్ మాత్రం పట్టనట్లు సమాధానం చెప్తున్నారన్నారు. కళాశాలలో చేరే ముందు ఫీజులు కట్టనవసరం లేదన్న యాజమాన్యం ఇప్పుడు వేలకు వేల ఫీజులు కట్టమని వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు కాలేజీలకు సైతం ఫీజురీయెంబర్స్మెంట్లు అందుతుంటే ప్రభుత్వ కాలేజీ అయినా తమకు స్కాలర్షిప్లు గానీ, రీయంబర్స్మెంటు గానీ రావటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అధ్యాపకులు సరైన సమయానికి రాక, క్లాసులు సరిగ్గా అవ్వటం లేదని ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేస్తే ఇంటర్నల్ మార్కుల్లో కోత పెట్టి వేధిస్తున్నారని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా అసలు ఈ సమస్యలేవీ తమ దృష్టికి రాలేదన బాధ్యాతారాహిత్యంగా సమాధానం చెప్పారు. తను కేవలం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాత్రమేనని తనకేమీ తెలియదంటూ ప్రిన్సిపల్ సమాధానాలు దాటవేశారు. కనీసం పైఅధికారులైనా తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి : పెన్నాకు జలకళ