ETV Bharat / state

రాజంపేటలో ఐదుగురు సైబర్ నేరగాళ్లు అరెస్టు - కడప జిల్లా

టెలికాం సంస్థలకు రావలసిన ఆదాయానికి గండికొడుతూ... విదేశీ ఫోన్ కాల్స్​ను లోకల్ కాల్స్​గా మార్చుకుంటూ సొమ్ము చేసుకున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను కడప జిల్లా కోడూరు పోలీసులు అరెస్టు చేశారు.

రాజంపేట డీఎస్పీ మురళీధర్
author img

By

Published : May 18, 2019, 10:47 PM IST

రాజంపేట డీఎస్పీ మురళీధర్

విదేశీ ఫోన్ కాల్స్​ను లోకల్ కాల్స్​గా మారుస్తూ... సొమ్ము చేసుకున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. కడు జిల్లా చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన నరసింహా, కోడూరుకు చెందిన విజయకుమార్, ఆర్.వెంకటరమణ, మధుకుమార్, తిరుపతికి చెందిన మేకల రాజేంద్ర అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నరసింహా రైల్వేకోడూరు పట్టణంలో సోని కమ్యూనికేషన్స్ అనే పేరుతో ఓ సెల్ ఫోన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. నకిలీ ఐడి ప్రూఫ్ ద్వారా వివిధ టెలికాం కంపెనీలకు చెందిన దాదాపు 500 సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి పెట్టుకున్నాడు.

చైనాకు చెందిన స్కైలైన్ అనే కంపెనీ ద్వారా ఓ పరికరాన్ని కొనుగోలు చేసి వివో ఐపీ సిస్టం ద్వారా రూటింగ్ గేట్వే అనే పరికరాన్ని ఉపయోగించి ఇతర దేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్... లోకల్ కాల్స్​గా మారుస్తూ... టెలికాం కంపెనీలకు వచ్చే ఆదాయాన్ని తన ఖాతాకు మళ్ళించుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. టెలికాం కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా... ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ తప్పుడు విధానాల ద్వారా గడచిన 14 నెలల్లో నిందితులు సుమారు రూ.30 లక్షలు అక్రమంగా సంపాదించినట్లు రాజంపేట డీఎస్పీ మురళీధర్ తెలిపారు.

ఇదీ చదవండి...

వీడియో ఆధారాలతోనే రీపోలింగ్: ద్వివేది

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.