ETV Bharat / state

కడప సర్వజన ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ సేవలు దూరం - రిమ్స్ ఆసుపత్రిలో సిటి స్కానింగ్ వార్తలు

కడప రిమ్స్ అసుపత్రిలో సిటి స్కాన్ యంత్రం మరమ్మతులకు నోచుకోలేదు. ఎంతో వ్యయ ప్రయాసలు పడి... వైద్యం కోసం వచ్చిన రోగులు నిరాశతోనే ఇంటిబాట పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిటి స్కానింగ్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టే స్తోమత లేక ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఫలితం లేకపోవటంతో తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

కడప సర్వజన ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ సేవలు దూరం

author img

By

Published : Nov 1, 2020, 5:34 PM IST

Updated : Nov 1, 2020, 7:47 PM IST

సర్వజన ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ సేవలు దూరం

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి.... జిల్లాలోని పేద రోగులకు పెద్దదిక్కు. అలాంటి రోగులకు ఇదే పెద్దాసుపత్రి. జిల్లా నలుమూలల నుంచి వైద్యసేవలు పొందేందుకు ఇక్కడేక వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యమున్న జిల్లా సర్కారు ఆసుపత్రిలో రెండేళ్లుగా వైద్యసేవల్లో ఎంతో కీలకమైన సీటీ స్కాన్‌ యంత్రం మూలకు చేరడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో చేసేదిలేక రూ.వేలల్లో అప్పులు చేసి ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.

రిమ్స్​లో 2010లో సీటీ స్కాన్‌ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో రోజుకు 10 నుంచి 15 మంది సీటీ స్కాన్‌ చేయించుకునేందుకు వచ్చేవారు. అనంతరం ఓపీ సేవలు బాగా మెరుగుపడడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ఇక్కడికి స్కానింగ్‌ చేయించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడ రోజుకు 20 నుంచి 35 వరకు సీటీ స్కానింగ్‌లు జరిగేవి. నాలుగేళ్లపాటు ఎలాంటి అంతరాయం లేకుడా యంత్రం సేవలందించింది. అనంతరం తరచూ మరమ్మతులకు గురవుతుండడం, అధికారులు మరమ్మతులు చేయించడం తరచూ జరుగుతుండేది. రెండేళ్ల కిందట యంత్రం పూర్తిగా మొరాయించగా, పరిశీలించిన సాంకేతిక నిపుణులు యంత్రానికి మరమ్మతులు చేసినా ఫలితం ఉండదని తేల్చి చప్పెడంతో మూలన పడేశారు. సీటీ స్కాన్‌ యంత్రం పనిచేయకపోవడం, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సీటీ స్కాన్‌ పరీక్షలకు డిమాండు పరెగడంతో .పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొంతమంది అప్పులు చేసి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తుండగా, మరికొంతమంది ఆర్థిక స్థోమత లేక, గత్యంతరం లేక వైద్యులిచ్చిన మందులతో కాలం వెళ్లదీస్తున్నారు.

చెస్ట్‌, అబ్డామిన్‌ స్కాన్లు అధికం

సాధారణ, చెస్ట్‌, అబ్డామిన్‌ సమస్యలతో బాధపడేవారు, శస్త్రచికిత్సలు చేయించుకునేవారికి సీటీ స్కాన్‌ తప్పనిసరి. లేకుంటే శస్త్రచికిత్సలు చేయరు. ఇలాంటి సమస్యలతో సర్వజన ఆసుపత్రికి రోజుకు దాదాపు 20 నుంచి 30 మంది దాకా వస్తుంటారు. వీరందరూ కూడా సీటీ స్కాన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తూ చీటీలు రాస్తున్నారు.

అధిక వసూళ్లు

సాధారణ జ్వరం, జలుబు వచ్చినా సీటీ స్కానింగ్‌ చేయించాలి లేదా కొవిడ్‌ పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. పెద్దాసుపత్రిని నమ్ముకుని జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది పేదలు ఇక్కడికి సీటీ స్కానింగ్‌కు వస్తుంటారు. అయితే యంత్రం అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. కడప నగరంలో 5 సీటీ స్కాన్‌ కేంద్రాలున్నాయి. ఇక్కడకు వచ్చేవారి నుంచి రూ.5 వేలు నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు.

రోజుకు 20 మందికి పైనే...

రహదారి ప్రమాదాల్లో తలకు గాయాలైనవారికి తప్పనిసరిగా సీటీస్కాన్‌ చేసి మెదడు పనితీరును పరిశీలిస్తారు. ఈ స్కాన్‌ ప్రైవేట్‌లో చేయించుకుంటే రూ.2,000 అవుతుంది. జిల్లాలో రహదారి ప్రమాదాలు అధికంగా జరుగుతుండడంతో రోజుకు 20 మంది దాకా సీటీ స్కాన్‌ కోసం ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.

రెండేళ్లుగా తిరుగుతున్నాను...

రాములమ్మ
రాములమ్మ

నా పేరు రాములమ్మ, మాది కోడూరులోని సాయినగర్‌. నేను కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాను. రెండేళ్ల కిందట ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందని కడప సర్వజన ఆసుపత్రిలో చూపించుకున్నాను. వైద్యులు సీటీ స్కాన్‌ చేయించాలని సూచించారు. ఇక్కడ అడిగితే పనిచేయలేదని రెండు నెలలు పడుతుందని చప్పొరు. ప్రతి రెండు నెలలకొకసారి వచ్చి వెళుతున్నాను. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో ప్రైవేటు కేంద్రంలో స్కానింగ్‌ చేయించుకోలేక మందులతో నెట్టుకొస్తున్నాను. ఇప్పటికే ఏడాది దాటింది. యంత్రం వస్తుందో రాదో తెలియడంలేదు.

డబ్బుల్లేక మందులతో నెట్టుకొస్తున్నా

రాజేశ్వరి
రాజేశ్వరి

నా పేరు రాజేశ్వరి. మాది రాయచోటి. నేను చెనిక్కాయల పరిశ్రమలో రోజుకూలీగా పనిచేస్తున్నాను. కరోనాకు ముందు పనిచేస్తుండగా కళ్లు తిరగడంతో కింద పడి పోయాను. వెంటనే కుటుంబసభ్యులు సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు సీటీ స్కాన్‌ చేయాలని, ఆసుపత్రిలో యంత్రం పనిచేయడంలేదు ప్రైవేటు కేంద్రానికి వెళ్లాలని సూచించారు. డబ్బుల్లేక పోవడంతో వైద్యులిచ్చిన మందులే వాడుతున్నాను. ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ యంత్రం వచ్చిందేమోనని వెళ్లి అడిగితే ఇంకా రాలేదంటున్నారు. ఏం చేయాలో పాలుపోవడంలేదు.

రెండు నెలల్లో కొత్తది వస్తుంది

వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. కొత్త సీటీ స్కాన్‌ యంత్రం మంజూరైందని, రెండు నెలల్లో వస్తుందని చప్పొరు. యంత్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే రోగులకు వైద్యసేవలందిస్తాం. - డాక్టర్‌ ప్రసాదరావు, సూపరింటెండెంట్‌

ఇవీ చదవండి

ఆర్టీసీ డ్రైవర్​కు గుండెపోటు​.. సురక్షితంగా ప్రయాణికులు

Last Updated : Nov 1, 2020, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.