కడప ఎర్రముక్కపల్లిలో కాకులు ఒకేసారి మరణించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకేసారి ఐదారు కాకులు మరణించడంతో స్థానికులు భయపడుతున్నారు. ఓవైపు కరోనా వైరస్ భయంతో ఇంటికే పరిమితమైన ప్రజలు.. ఇప్పుడు కాకులు ఒకదాని తర్వాత ఒకటి అకారణంగా చనిపోవడంతో..ఎందుకిలా జరుగుతోందోనని చర్చించుకుంటున్నారు. సమీపంలో ఎలాంటి విద్యుత్ తీగలూ లేవు. కాకుల మరణానికి మాత్రం కారణాలు తెలియరాలేదు. స్థానికులు నగరపాలక అధికారులకు సమాచారమిచ్చారు. ఇటీవల రాజమండ్రిలోనూ కాకులు మరణించాయని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: కాకుల మరణం.. స్థానికుల్లో భయం భయం!