ETV Bharat / state

ప్రపంచకప్‌ మ్యాచ్‌లపై  పందేలు... బుకీల అరెస్టు - cricket bookies

కడప జిల్లా జమ్మలమడుగు బి సి బి సి కాలనీలో ఐదుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. 3 లక్షల 5000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2019 ప్రపంచ కప్ ...పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు సంబంధించిన గెలుపోటములపై క్రికెట్ బెట్టింగ్ పాల్పడినట్లు డీఎస్‌పీ కృష్ణన్ చెప్పారు.

cricket bookies under arrest
author img

By

Published : Jun 27, 2019, 1:44 PM IST

బూకీలను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

బూకీలను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
Intro:Body:యాంకర్ : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ భూముల ఆక్రమణల తొలగింపు వ్యవహారం ఈ ఉద్రిక్తతకు కారణమయ్యింది. జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో దేవాదాయ శాఖ అధికారులు ఆక్రమణలు తొలగించారు. దీంతో అధికారులకు ఆక్రమణ దారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. చాలాచోట్ల దేవాలయ భూముల్లో ఆక్రమణలు ఉండగా కావాలనే కక్షపూరితంగా తమ ఆక్రమణలు కూల గొడుతున్నారంటూ ఆక్రమణ దారులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరింపచేసి నిర్మాణాలను కూలదోసారు. దీంతో ఆక్రమణదారులు రోడ్డెక్కారు.

యాంకర్ వాయిస్
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నరసింహారావుపేటలో ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెంటపాడు మండలం తాళ్ళముదునూరుపాడుకు చెందిన వెంకటేశ్వరస్వామి ఆలయ భూములు తాడేపల్లిగూడెంలో ఉన్నాయి. అయితే వాటిని కొందరు అక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. ఈ భూముల్లో ఫ్లాట్లు కింద విడదీసి రోడ్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో దేవాదాయ శాఖాధికారులు ఈరోజు ఉదయం ఆక్రమణలు కూల్చేందుకు సిద్ధమయ్యారు. జేసీబీలు, ట్రాక్టర్లు సాయంతో ఆక్రమణలు కూలగొట్టారు. దీంతో అధికారులకు, ఆక్రమణ దారులకు మద్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరింపచేశారు. ఒకానొకదశలో ఆక్రమణ దారులకు అధికారులకు మద్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. దీంతో తెలుగుదేశం నేతలు గొర్రెల శ్రీధర్ ఆయన సతీమణి గొర్రెల సునీత ఆక్రమణ దారులకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. గొర్రెల శ్రీధర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వివాదం ఇంకా ముదిరి పోలీసు ఐలాండ్ వద్ద ఆక్రమణ దారులు బైఠాయించారు. జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు తెలుగుదేశం నేతలు అక్కడికి చేరుకుని వారికి మద్దతునిచ్చారు. పోలీసులు ఆక్రమణ దారులను అరెస్టులు చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అయితే అధికారులు నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసి హెచ్చరికల బోర్డులు ఏర్పటుచేశారు. ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుంది.Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.