లాక్డౌన్ ఆంక్షల సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. టీ దుకాణాలకు ఎందుకు ఇవ్వలేదని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. కడపలో తేనీరు దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నగరంలో దాదాపు 4 వేల మంది ఛాయ్ దుకాణాలు పెట్టుకుని బతుకుతున్నారన్నారు. అవి తెరుచుకునేందుకు అనుమతిస్తే వారి జీవనానికి ఉపయోగపడుతుందని తెలిపారు. మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చినప్పుడు టీ దుకాణాలకు ఎందుకివ్వరని నిలదీశారు. వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు.
ఇవీ చదవండి..