లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో వలస కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం... మద్యం దుకాణాలను ఎలా తెరుస్తుందని సీపీఐ కడప జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. నిత్యావసర వస్తువులు తెచ్చుకోడానికి కట్టడి చేస్తున్న ప్రభుత్వం... మద్యం దుకాణాలను మాత్రం రాత్రి వరకు తెరిచి పెట్టడం దేనికి సంకేతం అని కడపలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రశ్నించారు. కరోనాను అదుపు చేయడానికి ఇన్ని రోజులపాటు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు పడిన శ్రమను వృధా అయినట్లేనని వ్యాఖ్యానించారు.
చిత్తశుద్ధి ఉంటే... 2నెలలు మద్యం దుకాణాలు మూసివేయాలి - cpi kadapa district secretary eshwaraiah Latest Press Meet News
లాక్డౌన్తో వలస కూలీలు ఆకలితో అలమటిస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం... మద్యం దుకాణాలు ఎలా తెరిచిందని సీపీఐ కడప జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ప్రశ్నించారు. కరోనాను అదుపు చేయడానికి ఇన్ని రోజులపాటు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు పడిన శ్రమ వృధా అయినట్లేనని వ్యాఖ్యానించారు.
లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో వలస కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం... మద్యం దుకాణాలను ఎలా తెరుస్తుందని సీపీఐ కడప జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. నిత్యావసర వస్తువులు తెచ్చుకోడానికి కట్టడి చేస్తున్న ప్రభుత్వం... మద్యం దుకాణాలను మాత్రం రాత్రి వరకు తెరిచి పెట్టడం దేనికి సంకేతం అని కడపలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రశ్నించారు. కరోనాను అదుపు చేయడానికి ఇన్ని రోజులపాటు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు పడిన శ్రమను వృధా అయినట్లేనని వ్యాఖ్యానించారు.
TAGGED:
కడపలో సీపీఐ ధర్నా న్యూస్