Shivashankar Reddy Petition dismiss: జైలులో ప్రత్యేక వసతులకు అనుమతినివ్వాలని కోరుతూ.. వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కడప కోర్టు కొట్టేసింది. శివశంకర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం తెలపటంతో పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ప్రస్తుతం కడప జైలులో శివశంకర్ రెడ్డి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
అనుమానాస్పద మృతి: ఇదిలా ఉండగా వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. నిద్రపోయిన సమయంలో అనారోగ్యంతోనే ఉన్న గంగాధర్‌రెడ్డి నిద్రలోనే మృతిచెందినట్లు అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఇప్పటికే మూడుసార్లు గంగాధర్‌రెడ్డిని విచారించింది. ఆయన మృతి నేపథ్యంలో క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి ఇంటి పరిసరాలను పరిశీలిస్తోంది.
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి గంగాధర్‌రెడ్డి అనుచరుడు. గంగాధర్ రెడ్డి స్వగ్రామం పులివెందుల కాగా.. ప్రేమ వివాహం చేసుకుని యాడికిలో ఉంటున్నారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రెండుసార్లు ఎస్పీని కలిసిన గంగాధర్‌రెడ్డి.. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ గతంలో ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి