కడప జిల్లా కమలాపురం పట్టణంలోని బీడీ కాలనీలో ప్రభుత్వ చౌక దుకాణం డీలర్ మహబూబ్ చాంద్‌ను కొన్ని కారణాల దృష్ట్యా తొలగించారు. ఈ విషయంపై.. అతను కోర్టుకు వెళ్లి తిరిగి డీలర్షిప్ పొందేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. ఈ నెల 7న జిల్లా కలెక్టర్ పృథ్వీ తేజ్ సైతం.. అతనికి డీలర్షిప్ ఇవ్వాలని ఆదేశించారు.
ప్రస్తుతం డీలర్ గా ఉన్న వ్యక్తి నుంచి కాటా, బయోమెట్రిక్ మిషన్‌ను స్వాధీనం చేసుకుని ఈ నెల 15నాటికి మహబూబ్‌కు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఎమ్మార్వో కృష్ణకుమార్ తెలియచేశారు. ఇప్పటికీ పరికరాలు ఇవ్వలేదని చాంద్ ఎమ్మార్వో వద్ద వాపోయాడు. కోర్టు, అధికారుల ఆదేశాలకు లోబడి చర్యలు తీసుకుంటామని.. 24గంటల్లో అతనికి డీలర్షిప్ స్వాధీనం చేస్తామని ఎమ్మార్వో చెప్పారు.
ఇదీ చదవండి: