కడపలో బ్లడ్ టు లివ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పవన్ కుమార్‌కు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారి కరోనా వారియర్ ఇంటర్నేషనల్ అవార్డు వరించింది. హైదరాబాద్‌లో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవోలు రాంబాబు చేతుల మీదుగా అందజేశారు. కరోనా కష్ట కాలంలో రక్తదానంపై అలుపెరగని సేవ చేస్తూ కొన్ని వేల మందిని కాపాడుతున్నందుకు గాను ఈ అవార్డు ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ఎంతోమందికి రక్తదానంపై అవగాహన కల్పించి వారిని రక్తదాతలుగా మారుస్తున్నందుకు గాను ఈ ఇంటర్నేషనల్ అవార్డ్ పవన్‌కు లభించిందన్నారు. ఈ సందర్భంగా సత్యవేలు రాంబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో మరింత ఉత్సహంగా ప్రజలకు సేవ చేస్తానని పవన్ పేర్కొన్నారు. ఈ అవార్డును ప్రతి రక్తదాతకు అంకితం ఇస్తున్నట్లు తెలియజేశారు.
ఇవీ చూడండి...