ETV Bharat / state

కడపలో కరోనా అనుమానిత వ్యక్తి...రిమ్స్​కు తరలింపు !

కరోనా లక్షణాలతో కడప జిల్లాలో ఓ వ్యక్తి రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించి నివేదిక వచ్చాక తదుపరి వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు స్పష్టం చేశారు.

కడపలో కరోనా అనుమానిత వ్యక్తి
కడపలో కరోనా అనుమానిత వ్యక్తి
author img

By

Published : Mar 28, 2020, 5:36 AM IST

కడప జిల్లాలో కరోనా అనుమానిత వ్యక్తిని గుర్తించారు. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈనెల 16న కువైట్ నుంచి దిల్లీ, చెన్నై మీదుగా కడపకు చేరుకున్నాడు. గత వారం రోజులుగా ఇంట్లోనే ఉన్న అతను నిన్న తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతూ... తానే రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన అధికారులు ప్రత్యేక వాహనంలో ఆ వ్యక్తిని కడప రిమ్స్​కు తరలించారు. పరీక్షల తరువాత తదుపరి వివరాలు వెల్లడిస్తామని స్థానిక తహశీల్దార్​ స్పష్టం చేశారు. ఆవ్యక్తి సంచరించిన ప్రాంతాల్లో అధికారులు పారిశుధ్య నివారణ చర్యలు చేపట్టారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.