ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు కరోనా పరీక్షల ఫలితం పాజిటివ్ వచ్చిందా..లేక నెగిటివ్ వచ్చిందా అనే విషయాన్ని జిల్లా వైద్యాధికారులు వెల్లడించాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం అంజాద్ బాషాకు కరోనా పరీక్షలు నిర్వహించినా.. ఇంతవరకూ అధికారులు ఏవిషయాన్ని ధృవీకరించలేదని అన్నారు.
ఇప్పటికైనా అధికారులు అధికారికంగా ఏ విషయాన్ని ధ్రువీకరించాలన్నారు. లేదంటే జిల్లా ప్రజలందరూ ఆందోళన చేస్తారని హెచ్చరించారు. జిల్లాలోని క్వారంటైన్ లో సరైన సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారని.. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి: