మహారాష్ట్రలోని పుణేలో కేన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందిన నందలూరు మండలం ఆడపూరుకు చెందిన మహిళకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఆమెను ఖననం చేయడానికి ప్రయత్నించగా... స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. కడప జిల్లా నందలూరుకు సమీపంలోని చెయ్యరు నదిలో అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నం చేయగా... స్థానికులు అభ్యంతరం చెప్పారు.
చివరికి.. స్థానిక అటవీ ప్రాంతంలోని 3 కిలోమీటర్ల దూరంలో ఎట్టకేలకు ఖననం చేశారు. అక్కడ కూడా కొంతమంది రైతులు అభ్యంతరం తెలుపగా... అధికారులు సర్దిచెప్పారు. కాగా.. కరోనా సోకిన మహిళ మృతదేహంతో పాటు వచ్చిన అంబులెన్స్‌లోని ఇద్దరు డ్రైవర్లు, ఐదుగురు కుటుంబ సభ్యులను వైద్య పరీక్షల నిమిత్తం కడప ఫాతిమా కళాశాలలోని క్వారంటైన్‌కు తరలించమని తహసీల్దార్ రవి శంకర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: