కరోనా మహమ్మారి గ్రామీణ ప్రాంతాలకు పాకుతుంది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో లాక్‌డౌన్ కాలంలో కేవలం నలుగురు మాత్రమే కరోనా బారినపడగా... లాక్‌డౌన్ అనంతరం 54 మందికి సోకింది. ముందుగా కరోనా సోకిన నలుగురు వ్యాధి నుంచి కోలుకున్నారు. మైదుకూరుతో సహా మండలంలోని సీతారామాంజనేయపురం, ఎన్.ఎర్రబల్లె, శెట్టివారిపల్లెలో కరోనా కేసులు నమోదయ్యాయి.
చాపాడు మండలంలో 8 కొవిడ్ కేసులు నమోదుకాగా ఒక ఖాదర్‌పల్లెలోనే 5 కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. మిగిలిన నలుగురు కోలుకున్నారు. పల్లవోలులో ఒకరు, వెదురూరులో ఇద్దరు కరోనా బారినపడ్డారు. దువ్వూరు మండలం దువ్వూరులో ఏడు కేసులు, పుల్లారెడ్డిపేటలో ఆరు, రాంసాయినగర్, క్రిస్టియన్ కాలనీల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నందున ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి : పీఎం స్వనిధి.. చిరువ్యాపారుల పెన్నిధి