ETV Bharat / state

బ్యానర్​ల ఏర్పాటుపై అధికార పార్టీ వర్గాల వివాదం..రోడ్డుపై బైఠాయింపు - కడపలో బ్యానర్ ల వివాదం

బ్యానర్ల ఏర్పాటు విషయంలో ఒకే పార్టీకి చెందిన వారి మధ్య వివాదం మెుదలై.. చివరకు రహదారిపై నిరసన చేసే పరిస్థితికి వచ్చింది. ఈ ఘటన కడప జిల్లాలోని రాయచోటి మండలంలో జరిగింది.

vivadham
బ్యానర్ ల ఏర్పాటుపై ఒకే పార్టీలో వివాదం
author img

By

Published : Jan 4, 2021, 2:23 PM IST

కడప జిల్లాలోని ఏపీలవంకపల్లి గ్రామంలో బ్యానర్​ల ఏర్పాటుపై... అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. వైకాపా నేతల ఫొటోలతో కొందరు వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని మరో వర్గం ఆదివారం రాత్రి వాటిని చించేసి.. చెప్పులు కట్టారు. ఈ విషయంపై ఆగ్రహించిన వేరే వర్గం నాయకులు... రాయచోటి-కదిరి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో గంటన్నర పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఈ విషయం తెలుసుకున్న రాయచోటి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫ్లెక్సీలో తమ ఫొటోలు లేవన్న ఆగ్రహంతోనే అదే పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఈ పని చేసి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:తాడిపత్రిలో జేసీ సోదరుల గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.