ETV Bharat / state

ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. తమకు జీవనాధారం లేదని వాపోతున్నారు. దీనికి తోడు కరోనాతో ఎక్కడ పనులు దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా క్యాంపు కార్యాలయం వద్ద భవన కార్మికులు ఆందోళనలు చేశారు.

ఉపముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టండించిన భవన నిర్మాణ కార్మికులు

author img

By

Published : Nov 17, 2020, 2:54 PM IST

కడప జిల్లాలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా క్యాంపు కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. కడప నగరంలో ఉన్న అంజాద్ బాషా కార్యాలయం వద్దకు భవన నిర్మాణ కార్మికులు ర్యాలీగా వచ్చి ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కోవిడ్ కారణంగా ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని నాయకులు ఆక్షేపించారు. భవన నిర్మాణ కార్మికులందరికీ 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండు చేశారు. కార్మికులు క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేయడంతో లోపల ఉన్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా బయటికి వచ్చారు. కార్మికుల సమస్యలను సావధానంగా విన్నారు.

వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు వినతిపత్రాన్ని ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.